విడుదలైన రేయ్ ఆడియో

rey_audio_launch
రేయ్ సినిమా ఆడియో కొద్దిసేపటి క్రితమే శిల్పకళా వేదికలో విడుదలైంది. సాయి ధరం తేజ్ హీరోగా పరిచయంకానున్న ఈ సినిమాలో సయామీ ఖేర్, శ్రద్ధా దాస్ లు హీరోయిన్స్. చక్రి సంగీత దర్శకుడు. ఈ సినిమా తోలి సి.డి ని ముఖ్య అతిధిగా వచ్చిన పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు

ఈ వేడుక లో పవన్ మాట్లాడుతూ “సాయి సినిమాలలో నటించాలని ఉందని చెప్పినప్పుడు పనిమీద నిజాయితీ, నమ్మకం వుంటే చాలని తెలిపాను. ప్రేక్షకాదరణ పొందాలంటే చాలా కష్టపడి పనిచెయ్యాలని నా ఉద్దేశం. ఎటువంటి పరిస్థితులలోనూ చౌదరి గారు తలపెట్టిన పనిని వదులుకోరు. సాయి కి నేను చేసింది ఎమన్నా వుందంటే శిక్షణకు తీసుకెళ్ళడమే. మిగతాది దర్శకుడే చూసుకున్నాడు. తనకు విజయం సాధించాలని ఆశిస్తున్నా ” అని తెలిపారు

దర్శకుడు, హీరో పవన్ కు ప్రత్యెక కృతజ్ఞతలు తెలిపారు. “నేను చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ల నుండి చాలా నేర్చుకున్నా. నేను చిరుకి అభిమానిని. పవన్ కి భక్తుణ్ణి. కానీ ఎప్పటిక్లి మీలో ఒకన్ని ” అని సాయి తెలిపాడు. ఈ సినిమా ఫిబ్రవరి 5 న విడుదలకానుంది

Exit mobile version