బద్రి షూటింగ్ లో రేణు చాల ఇబ్బంది పడ్డారట..!

బద్రి షూటింగ్ లో రేణు చాల ఇబ్బంది పడ్డారట..!

Published on Apr 20, 2020 11:00 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి భారీ క్రేజ్ తెచ్చిపెట్టిన చిత్రాలలో బద్రి ఒకటి. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. పూరికి ఇది మొదటి సినిమా కావడం గమనార్హం. ఈ సినిమా విడుదలై నేటికి సరిగ్గా 20ఏళ్ళు. బద్రి 2000 ఏప్రిల్ 20న విడుదలై సక్సెస్ అందుకుంది. ఈ మూవీలో ఒక హీరోయిన్ గా నటించిన రేణూ దేశాయ్ ఆ మూవీ షూటింగ్ సమయంలో తీసిన ఓ ఫోటో తన ఇంస్టాగ్రామ్ లో పంచుకుంది.

ఈ మూవీ షూటింగ్ విదేశాలలో సిటీకి దూరంగా ఓ రిమోట్ ఏరియాలో జరిపారు. ఆ సమయంలో అక్కడ షాట్ గ్యాప్ లో కూర్చోవడానికి చైర్స్ కూడా లేవట. దీనితో పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్న బండపై పడుకోగా, రేణు నిలుచున్నారు. ఆమె షార్ట్ స్కర్ట్ వేసుకొని ఉండడం వలన నేలపై కుర్చోలేని పరిస్థితి ఉందట. ఈ విషయాన్ని ఆ త్రో బ్యాక్ పిక్ పంచుకొని రేణూ దేశాయ్ తెలియజేశారు. బద్రి సినిమాలో సూపర్ హిట్ సాంగ్ బంగాళా ఖాతంలో… సాంగ్ షూట్ సమయంలో తీసిన ఫోటో అది. ఇక ఈ మూవీ సమయంలోనే పవన్-రేణు ప్రేమలో పడి ఆ తరువాత పెళ్లి కూడా చేసుకున్నారు.

https://www.instagram.com/p/B_MJ-XEBXNC/?igshid=g3v3550bpzaj

సంబంధిత సమాచారం

తాజా వార్తలు