తన మదిలోని భావాలను బయటపెట్టడంలో సమంత ఆమెకు ఆమే సాటి. మంచి పాత్ర చిత్రీకరణ, మంచి కధ గనుకవుంటే హీరో ఎవరు, దర్శకుడు ఎవరు, బ్యానర్ ఏంటి, పారితోషికం ఎంత అనేవి అసలు ఆలొచించము అని చాలా మంది హీరోయిన్లు అంటూనేవుంటారు.
కానీ సమంత ఈ ప్రశ్నకు కాస్త విభిన్నమైన సమాధానాన్ని ఇచ్చింది. కధ, పాత్ర చిత్రీకరణ బాగుంటే ఒప్పుకున్నట్టే నిర్మాత చెప్పిన పారితోషికం నచ్చితే కూడా సినిమాను ఒప్పుకుంటుందట.. కధ, పాత వగైరా సినీ జీవితానికి దోహదపడితే ఈ విషయం ఆర్ధికంగా సహాయపడుతుంది అని ఆమె భావన.