గతేడాది తెలుగులో ‘ఎవరు’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న హీరోయిన్ రెజినా తమిళంలో కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ సైన్ చేసిన సంగతి తెలిసిందే. వీటిలో కార్తిక్ రాజు డైరెక్షన్లో రూపొందనున్న సినిమా కూడా ఒకటి ఉంది. ఈ చిత్రం ఈరోజే పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ ప్రాజెక్ట్ తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకేసారి రూపొందనుంది.
ఈ ఫీమేల్ సెంట్రిక్ మూవీలో రెజినా ఆస్ట్రాలజర్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం పట్ల తాను చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నట్టు గతంలోనే రెజినా తెలిపింది. ఈ చిత్రాన్ని యాపిల్ స్టూడియోస్ పతాకంపై రాజశేఖర్ వర్మ నిర్మించనున్నారు. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ ఈరోజు నుండే మొదలుకానుంది.