ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘టూరిస్ట్ ఫ్యామిలీ’

ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘టూరిస్ట్ ఫ్యామిలీ’

Published on May 28, 2025 7:05 AM IST

తమిళ సినిమా దగ్గర రీసెంట్ గా వచ్చిన సెన్సేషనల్ హిట్ చిత్రం “టూరిస్ట్ ఫ్యామిలీ”. చిన్న సినిమాగా వచ్చి భారీ హిట్ గా నిలిచిన ఈ సినిమా అక్కడ మంచి లాభాలు అందించి దక్షిణాది సినిమా దగ్గర మంచి హాట్ టాపిక్ గా మారింది. నటుడు శశి కుమార్ ప్రధాన పాత్రలో దర్శకుడు అబిషన్ జీవింత్ తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్లులో ఇంకా రాణిస్తున్నప్పటికీ అప్పుడే ఓటీటీ డేట్ ని ఫిక్స్ చేసేసుకుంది.

ఇక ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు జియో హాట్ స్టార్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ జూన్ 2 నుంచి సినిమా అందుబాటులోకి వస్తుంది అని రివీల్ చేసేసారు. అయితే ఈ చిత్రం తమిళ్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా స్ట్రీమింగ్ కావచ్చని తెలుస్తోంది. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు