ఓటిటి రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న రీసెంట్ తమిళ హారర్ కామెడీ చిత్రం!

ఓటిటి రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న రీసెంట్ తమిళ హారర్ కామెడీ చిత్రం!

Published on Jun 10, 2025 3:20 PM IST

తమిళ నాట మంచి క్రేజ్ ఉన్న యంగ్ కమెడియన్స్ లో నటుడు సంతానం కూడా ఒకరు. మన తెలుగు ఆడియెన్స్ కి కూడా బాగా తెలిసిన సంతానం హీరోగా నటించిన రీసెంట్ చిత్రమే “డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్”. గీతికా తివారి హీరోయిన్ గా, గౌతమ్ మీనన్, యషికా ఆనంద్, రెడిన్ కింగ్స్ సహా సెల్వ రాఘవన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రేమ్ ఆనంద్ తెరకెక్కించారు.

అయితే కొంచెం వినూత్న హారర్ కామెడీగా ప్లాన్ చేసిన ఈ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. కానీ ఇప్పుడు ఫైనల్ గా ఓటిటిలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది. ఈ సినిమా తాలూకా స్ట్రీమింగ్ హక్కులు జీ5 సొంతం చేసుకోగా వీరు ఈ జూన్ 13 నుంచి సినిమాని స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. సో అప్పుడు మిస్ అయ్యినవారు ఈ సినిమాని చూడాలి అనుకుంటే ఆరోజు వరకు ఆగాలి. ఇక ఈ సినిమాని శ్యామ్ సింగ రాయ్ నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ తెరకెక్కించగా ఆఫ్రో సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు