పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పీరియాడిక్ వార్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ ఇస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన దగ్గర్నుంచి ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలా ఉండబోతున్నాయా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
అయితే, తాజాగా ఈ చిత్ర టైటిల్ టీజ్ పోస్టర్‌ను మేకర్స్ రివీల్ చేశారు. అతడే ఒక సైన్యం అనే కాంటెక్స్ట్‌తో ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఈ పోస్టర్‌లో మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు. ‘1932 నుంచి ది మోస్ట్ వాంటెడ్’ అనే క్యాప్షన్ ఈ పోస్టర్‌లో కనిపిస్తుంది. దీంతో అసలు ఈ సినిమాలో ప్రభాస్ ఎలాంటి పాత్ర చేస్తున్నాడా.. అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
ఇక ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రేపు(అక్టోబర్ 23) ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు విశాల్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.