
ప్రభాస్ మరియు తమన్నా ప్రధాన పాత్రలలో వస్తున్న “రెబల్” నైజాంలో అద్భుతమయిన ఓపెనింగ్స్ రాబట్టింది. మాకు అందిన ప్రత్యేక సమాచారం ప్రకారం ఈ చిత్రం మొదటి రోజు 2.1 కోట్లు వసూలు చేసింది. ప్రభాస్ చిత్రం ఇంత వసూలు చెయ్యడం సిని పండితులను ఆశ్చర్యపరిచింది. ఈ వారాంతానికి నైజాంలో మాత్రమే ఈ చిత్రం 8.5 కోట్లు వసూలు చేస్తుందని అంచనా. ఈ చిత్రానికి మిశ్రమ టాక్ వచ్చినా ఈ మొత్తాన్ని వసూలు చెయ్యగలగడం ఆసక్తికరమయిన విషయం. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ మాస్ ఎంటర్ టైనర్ బి మరియు సి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రం విడుదలకు ముందు ఏర్పడిన భారీ అంచనాలు ఈ చిత్రానికి మొదటి రోజు ఈ మొత్తాన్ని వచ్చేలా చేశాయి. జే భగవాన్ మరియు జే పుల్లారావు ఈ చిత్రాన్ని బాలాజీ సిని మీడియా బ్యానర్ మీద నిర్మించారు. దీక్ష సెత్ కీలక పాత్ర పోషించగా ఈ చిత్రానికి లారెన్స్ సంగీతం అందించారు