ఒక్క పాట మినహా పూర్తయిన ‘రెబల్’


చాలా కాలంగా నిర్మాణ దశలోనే ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రెబల్’ చిత్రం చిత్రీకరణ మొత్తానికి చివరి దశకు చేరుకుంది. ఒక్క పాట మినహా మిగిలిన చిత్రీకరణ అంతా పూర్తి చేసుకుంది. ఈ పాటని ఆగష్టు 4 నుండి ఆగష్టు 9 వరకు షూట్ చేయనున్నారు మరియు ఆ పాటతో ఈ చిత్ర చిత్రీకరణ పూర్తవుతుంది. మిల్క్ బ్యూటీ తమన్నా మరియు దీక్షా సేథ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ దర్శకత్వంతో పాటు సంగీత భాద్యతలు కూడా చేపట్టారు.

ప్రభాస్ కెరీర్లోనే హై బడ్జెట్ చిత్రంగా ప్రారంభమైన ఈ చిత్ర చిత్రీకరణ ఎక్కువ రోజులు నిర్మాణ దశలో ఉండడం వల్ల ఈ చిత్రానికి అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అయ్యింది. జె. పుల్లారావు మరియు జె. భగవాన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ఆడియోను ఆగష్టు మొదటి అర్ధభాగంలో విడుదల చేసి, సినిమాని ఆగష్టు చివరి వారంలో గాని, సెప్టెంబర్ మొదట్లో కాని విడుదల చేయడానికి సన్నాహాలు చేసున్నారు.

Exit mobile version