యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రెబల్’ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని ఈ నెల (సెప్టెంబర్) 28న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఈ చిత్ర నిర్మాత స్వయంగా మాకు తెలియజేశారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ప్రభాస్ డేర్ అండ్ డాషింగ్ గా కనిపిస్తున్న ఈ చిత్రానికి చిత్ర పరిశ్రమలో మంచి టాక్ వినిపిస్తోంది.
జె. భగవాన్ మరియు జె. పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మిల్క్ బ్యూటీ తమన్నా మరియు దీక్షా సేథ్ కథానాయికలుగా నటించారు. రాఘవ లారెన్స్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోను ఈ నెల 14న విడుదల చేయనున్నారు.