లారెన్స్ మీద కంప్లైంట్ ఇచ్చిన నిర్మాతలు

లారెన్స్ మీద కంప్లైంట్ ఇచ్చిన నిర్మాతలు

Published on Oct 15, 2012 12:36 PM IST


రెబల్ డైరెక్టర్ లారెన్స్ మీద ఆ చిత్ర నిర్మాతలు నిర్మాతల మండలిలో కంప్లైంట్ చేసారు. వివరాల్లోకి వెళితే ప్రభాస్ హీరోగా లారెన్స్ డైరెక్షన్లో తెరకెక్కిన రెబల్ సినిమా ఇటీవలే విడుదలైంది. విడుదలైన మొదటి వారం భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్నప్పటికీ ఆ తరువాత కలెక్షన్స్ భారీగా తగ్గిపోయాయి. అయితే ఈ చిత్రం మొదట 22.5 కోట్లతో పూర్తి చేస్తానని మాట ఇచ్చిన లారెన్స్ షూటింగ్ ఆలస్యం చేస్తూ ఉండటం వల్ల సినిమా బడ్జెట్ 40 కోట్లు దాటిందని నిర్మాతలు జే. భగవాన్, జే. పుల్లా రావు చెబుతున్నారు. బడ్జెట్ భారీగా పెరగడం వల్ల తాము 5 కోట్లకు పైగా నష్టపోయామని వారు నిర్మాతల మండలిలో కంప్లైంట్ చేసారు. అయితే దీని పై లారెన్స్ వెర్షన్ మరోలా ఉంది. తనకు ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వకపోగా తనకు ఇస్తానన్న రీమేక్ రైట్స్ తనకు తెలియకుండా అమ్మేశారని చిత్ర నిర్మాతల మీద దర్శకుల సంఘానికి ఫిర్యాదు చేసారు.

తాజా వార్తలు