లారెన్స్ కి ఫైన్ వేసిన నిర్మాతల మండలి

లారెన్స్ కి ఫైన్ వేసిన నిర్మాతల మండలి

Published on Dec 16, 2012 5:41 PM IST

Raghava-Lawrence
లారెన్స్ విషయంలో నిర్మాతల మండలి ఒక నిర్ణయానికి వచ్చింది. “రెబల్” చిత్ర సమయంలో చెప్పిన దానికన్నా బడ్జెట్ పెంచేశారు అన్న అంశం మీద నిర్మాతలు జె.పుల్లారావు మరియు జె భగవాన్ లారెన్స్ మీద కేసు వేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పొందడంతో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు నిర్మాతల మండలి ఈ కేసు నిమిత్తం లారెన్స్ ని 2.5 కోట్లను నిర్మాతలకు చెల్లించాలని ఆదేశించింది. లారెన్స్ ప్రస్తుతం పదిహేను కోట్ల జరిమాన తప్పించుకున్నందుకు ఆనందపడాలా దర్శకుడిగా తన ఉనికికి ప్రమాదం వచ్చిందని ఆనందపడాలా అన్న సందిగ్ధంలో పడ్డారు. ఎట్టకేలకు నిర్మాతల మండలి నుండి సాహసోపెతమయిన నిర్ణయం అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు