‘డార్లింగ్’ మరియు ‘Mr పర్ ఫెక్ట్’ లాంటి క్లాస్ సినిమాల తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రెబల్’ మూవీ అన్ని హంగులతో ఈ శుక్రవారం బాక్స్ ఆఫీసు వద్ద సందడి చేయడానికి సిద్దమవుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. ఈ చిత్రంలో ఫుల్ యాక్షన్ ఓరియెంటెడ్ పాత్ర చేస్తున్న ప్రభాస్ సరసన మిల్క్ బ్యూటీ తమన్నా మరియు దీక్షా సేథ్ కథానాయికలుగా నటిస్తున్నారు.
కొరియోగ్రాఫర్ నుండి దర్శకుడిగా మారిన రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సంగీతం కూడా ఆయనే అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్స్ మరియు విజువల్స్ సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రభాస్ ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్న ‘రెబల్’ చిత్రం విడుదలకి ముందే మంచి బుజినెస్ జరుపుకుంటుందని అంచనాలు వేస్తున్నారు. ఈ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా ఒక కీలక పాత్రలో కనిపించనుండడం విశేషం.