ప్రేమ వారధిలో రియల్ స్టార్ శ్రీహరి


సీతారామ ఫిలిం ప్రొడక్షన్స్ నిర్మాణంలో రాబోతున్న చిత్రం “ప్రేమ వారధి”. ఈ చిత్రంలో రియల్ స్టార్ శ్రీహరి ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఆర్.వి.సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగేంద్ర మరియు రాఘన చిన్నస్వామి ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రం నిన్న హైదరాబాద్లో మొదలయ్యింది. ఈ కార్యక్రమంలో శ్రీహరి మాట్లాడుతూ “కుటుంబాన్ని ప్రేమించినవాడే నిజమయిన ప్రేమికుడు అవుతాడు అన్న అంశం మీద ఈ చిత్రం ఉండబోతుంది. ఇందులో నా పాత్ర ప్రేమికులను కలిపే వ్యక్తిగా ఉండబోతుంది” అని అన్నారు.

ఈ చిత్ర కథ వినగానే శ్రీహరి ఒప్పుకున్నట్టు దర్శకుడు తెలిపారు. ఈ చిత్ర చిత్రీకరణ ఆగస్ట్ రెండవ వారంలో మొదలవుతుంది చిత్రాన్ని దీపావళికి విడుదల చెయ్యనున్నారు. నాగబాబు,ఆహుతి ప్రసాద్ ,సన,హేమ,దువ్వాసి మోహన్,సుమన్,సత్యం రాజేష్ మరియు ఇతరులు ఈ చిత్రంలో కనిపించనున్నారు.

Exit mobile version