“కింగ్” అక్కినేని నాగార్జున పరిశ్రమలో కొత్త పోకడలను ప్రోత్సహించడంలో ఎప్పుడు ఒకడుగు ముందే ఉంటారు. ఆయన “లవ్లీ” చిత్ర వంద రోజుల ఫంక్షన్ కి హాజరయ్యారు అక్కడ ఈ చిత్ర విజయం గురించి సంతోషం వ్యక్తపరచడమే కాకుండా ఈ చిత్రంలో బి.జయ పనితనాన్ని మెచ్చుకున్నారు. ” నాకు ఎప్పుడు ఒక దర్శకురాలితో పని చెయ్యాలని ఉంటుంది ఒకవేళ జయ దగ్గర మంచి కథ ఉంటె ఆమె దర్శకత్వంలో నటించడానికి నేను సిద్ధం” అని అన్నారు. ఈ కార్యక్రమంలో కూడా నాగార్జున తన రాబోతున్న దశరథ్ చిత్రం “లవ్ స్టొరీ” లుక్ లో చూపరులను ఆకట్టుకున్నారు. ఇదిలా ఉండగా ఆయన నటించిన భక్తిరస చిత్రం “శిరిడి సాయి” సెప్టెంబర్లో విడుదలకు సిద్దమయ్యింది.