రవితేజ చేతుల మీదుగా విడుదల కానున్న ‘శింబు-కల్యాణి ప్రియదర్శన్’ల “మానాడు” టీజర్

రవితేజ చేతుల మీదుగా విడుదల కానున్న ‘శింబు-కల్యాణి ప్రియదర్శన్’ల “మానాడు” టీజర్

Published on Feb 2, 2021 5:52 PM IST

Raviteja to release Maanaadu teaser tomorrow

తమిళ్ స్టార్ శింబు – కల్యాణి ప్రియదర్శన్ జంటగా… క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో.. వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ‘సురేష్ కామాచి” 125 కోట్ల భారీ బడ్జెట్ తో హిందీ-తమిళ్-తెలుగు-కన్నడ-మలయాళ భాషల్లో నిర్మిస్తున్న బహుభాషా చిత్రం “మానాడు”. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను మాస్ మహరాజా రవితేజ రిలీజ్ చేయనున్నారు. ఫిబ్రవరి 3, మధ్యాహ్నం 2.34 నిమిషాలకు రవితేజ ‘మానాడు’ టీజర్ రిలీజ్ చేయనున్నారు.

పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శింబు ముస్లింగా నటిస్తుండడం గమనార్హం. సుప్రసిద్ధ దర్శకులు భారతీరాజా, ఎస్.ఏ.చంద్రశేఖర్, ఎస్.జె.సూర్య, కరుణాకరన్ ఈ చిత్రంలో నటిస్తుండడం విశేషం. తమ చిత్రం ‘మానాడు’ తెలుగు టీజర్ ను తాజాగా ‘క్రాక్’ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రవితేజ విడుదల చేయనుండడం పట్ల దర్శకనిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు!!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు