దూసుకెళ్తాకి రవితేజ వాయిస్ ఓవర్

దూసుకెళ్తాకి రవితేజ వాయిస్ ఓవర్

Published on Oct 2, 2013 9:30 AM IST

Ravi-Teja's-voice-over-for-
మాస్ మహారాజ రవితేజ తన తోటి తారల సినిమాల విషయంలో హెల్ప్ చెయ్యడానికి ఎప్పుడు సిద్దంగా ఉంటాడు. గతంలో ఎస్ఎస్ రాజమౌళి తీసిన మర్యాద రామన్న సినిమాని రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. రవితేజ మరోసారి మంచు విష్ణు హీరోగా నటించిన ‘దూసుకెళ్తా’ సినిమాకి వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 11న రిలీజ్ కానుంది.

సినిమాలో హీరో యొక్క చిన్న నాటి ఎపిసోడ్ కి రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడు. మాములుగా చాలా కామెడీగా సాగే ఆ ఎపిసోడ్ కి రవితేజ వాయిస్ ఓవర్ తోడైతే ఇంకా ఫుల్ కామెడీగా తయారయ్యే అవకాశం ఉంది. ఈ చిత్ర డైరెక్టర్ వీరు పొట్ల రవితేజ వాయిస్ ఓవర్ ఇస్తుండడం వల్ల హ్యాపీ గా ఉండటమే కాకుండా సినిమా మొదట్లో రవితేజ వాయిస్ వస్తుందని అలాగే మూవీలో విష్ణు ఒక జర్నలిస్ట్ గా కనిపిస్తాడని తెలియజేశారు.

తాజాగా రవితేజ ట్రైలర్ చూసి విష్ణుకి కాల్ చేసి సినిమా బాగా వచ్చిందని కితాబులిచ్చారు. లావణ్య త్రిపతి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని విష్ణు నిర్మించాడు, మణిశర్మ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు