ఇటలీలో చిత్రీకరణ జరుపుకోనున్న సార్ వస్తారా


తాజా సమాచారం ప్రకారం రవితేజ తరువాతి చిత్రం “సార్ వస్తారా” త్వరలో ఇటలీ మరియు స్విట్జర్లాండ్లలో చిత్రీకరణ జరుపుకోనుంది. రవితేజ,కాజల్ మరియు రిచా గంగోపాధ్యాయ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విని దత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రధాన బాగా చిత్రీకరణ గత నెల ఊటీలో మొదలయ్యింది. రవితేజ మరియు రిచాల నడుమ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ విజయ్ కే చక్రవర్తి చిత్రీకరణ ఏర్పాటుల నిమిత్తం ఇప్పటికే ఇటలీలోని మిలాన్ చేరుకున్నారు. త్వరలో మిగిలిన చిత్ర బృందం ఆయనతో కలుస్తుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version