మాస్ మహారాజ్ ‘రవితేజ’ నటిస్తున్న ‘పవర్’ మూవీ ఫస్ట్ లుక్ సినీ ప్రేమికులు , అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఏపీ 09 సిఎం 9999 అనే నెంబర్ కలిగిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పై కూర్చొని ఉన్నాడు. సినిమాపై అంచనాలు పెంచే విధంగా, ఈ పోస్టర్ లో రవితేజ పోలీస్ డ్రెస్ లో కనిపిస్తున్నారు.
మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తుండగా, రాక్ లైన్ వెంకటేష్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం రవితేజ శైలిలో కామెడీ మరియు యాక్షన్ కలిసి ఉంటుందని భావిస్తున్నారు. హన్సిక హీరోయిన్ గా, ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుపుకుంటోంది.
‘పవర్’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ధమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.