నిప్పు విడుదల తేదీ వాయిదా?

నిప్పు విడుదల తేదీ వాయిదా?

Published on Jan 23, 2012 12:06 PM IST


గుణశేఖర్ డైరెక్షన్లో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ‘నిప్పు’ ఫిబ్రవరి 2న విడుదల కావాల్సి ఉండగా మా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి 2వ వారంలో విడుదల చేయాలని నిర్మాత భావిస్తున్నారు. దీని గురించి అధికారికంగా త్వరలో ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఎందుకు వాయిదా పడింది అనే విషయం పై కచ్చితమైన సమాచారం లేదు. రవితేజ మరియు దీక్షా సేథ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వైవీఎస్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. నటకిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు