రాక్ కాస్టిల్ వద్ద దరువు షూటింగ్


మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న సోషియో ఫాంటసి చిత్రం ‘దరువు’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాదులోని రాక్ కాస్టిల్ లో జరుగుతుంది. పూర్తి కలర్ఫుల్ గా డెకరేట్ చేసిన ఈ సెట్లో రవితేజ మరియు తాప్సీ పాల్గొంటున్నారు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ పథకం పై బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్నారు. దరువు చిత్రానికి గాను సౌండ్ అఫ్ మాస్ అనే ట్యాగ్ లైన్ నిర్ణయించారు. మే 4న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి విజయ్ అంటోనీ సంగీతం అందించాడు.

Exit mobile version