మాస్ మహారాజ రవితేజ, తాప్సీ కలిసి నటిస్తున్న దరువు షూటింగ్ చివరు దశకు చేరుకుంది. ఈనెల 25 తో షూటింగ్ పూర్తి చేసి గుమ్మడి కాయ కొట్టబోతున్నారు. గతంలో శ్రీ వెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ బ్యానర్ పై ‘ప్రేమంటే ఇదేరా’, ‘తమ్ముడు’ వంటి హిట్ చిత్రాలను నిర్మించిన బూరుగుపల్లి శివరామకృష్ణ చాలా రోజుల తరువాత నిర్మిస్తున్న చిత్రం ఇది. శౌర్యం, శంఖం వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన శివ మళ్లీ తన ఈ సినిమాతో తన అద్రుష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. దరువు సినిమాకి విజయ్ అంటోనీ సంగీతం అందిస్తున్నాడు. ఏప్రిల్లో విడుదల కానున్న మే 4 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.