ఆ దర్శకునితో మరో ఇంట్రెస్టింగ్ రోల్ లో మాస్ మహారాజ్.?


మాస్ మహారాజ్ రవితేజ అంటే ఇష్టపడని టాలీవుడ్ ఆడియన్స్ ఎవరూ ఉండరు. ఓ స్టార్ హీరో సక్సెస్ అందుకంటే కామన్ గా అందరి హీరోల ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేది మాత్రం రవితేజ సినిమాలకే అనే చెప్పాలి.

అయితే ఇప్పుడున్న ట్రెండ్ కు రొటీన్ గా కాకుండా భిన్నంగా ఉంటేనే కథలు నచ్చుతాయన్న ఉద్దేశంతో వైవిధ్య చిత్రాల దర్శకుడు వి ఐ ఆనంద్ తో తెరకెక్కించిన చిత్రం “డిస్కో రాజా” ఆకట్టుకోలేకపోయింది. దీనితో రవితేజకు మంచి పడాల్సిన సమయం మళ్లీ వచ్చింది.

దీనితో తన హిట్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనితో “క్రాక్” అనే మరో కాప్ డ్రామాతో రవితేజ రెడి అయ్యారు. అలాగే మరో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో కూడా ఓ సినిమాను రవితేజ కమిట్ అయ్యినట్టు తెలిసింది.

అయితే “డిస్కో రాజా” ఆ ఇంట్రెస్టింగ్ పాత్ర పోషించిన రవితేజ ఈ దర్శకుని సినిమాలో కూడా ఓ ఇంట్రెస్టింగ్ రోల్ లో కనిపించనున్నారని బజ్ వినిపిస్తుంది. అలాగే ఇప్పటి వరకు రవితేజ చేయని రోల్ లో కనిపించే అవకాశాలు ఉన్నట్టు వినికిడి. మరి రవితేజ ఎలాంటి రోల్ లో కనిపించనున్నారో అన్నది చూడాలి.

Exit mobile version