జూన్ నెలాఖరుకు రానున్న ‘దేవుడు చేసిన మనుషులు’

జూన్ నెలాఖరుకు రానున్న ‘దేవుడు చేసిన మనుషులు’

Published on May 28, 2012 12:12 PM IST


విలక్షణ దర్శకుడు పూరి జగన్నాధ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘దేవుడు చేసిన మనుషులు’ షూటింగ్ ఈ నెలాఖరుకు పూర్తి కానుంది. మాస్ మహా రాజా రవితేజ మరియు గోవా బ్యూటీ ఇలియానా జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ నెలాఖరుకు విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నారు. పూరి జగన్నాధ్ ట్రేడ్ మార్కు డైలాగులతో తెరకెక్కుతున్న ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తి చేసుకుని ప్రస్తుతం ఇటలీలో పాటల చిత్రీకరణ జరుపుకుంటుంది. రఘు కుంచె సంగీత అందిస్తున్న ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. బిజినెస్ మేన్ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో చాలా వేగంగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు