రవితేజ-పూరీ కాంబినేషన్లో కామెడీ సినిమా

రవితేజ-పూరీ కాంబినేషన్లో కామెడీ సినిమా

Published on Jan 24, 2012 12:17 PM IST


మాస్ మహారాజ రవితేజ మరియు పూరీ కలిసి గతంలో ‘ఇడియట్’ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మేజిక్ క్రియేట్ చేసిన విషయం తెల్సిందే. అలాగే ఆ చిత్రం ఇద్దరి కెరీర్ నే మార్చేసింది. ఆ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతుంది. ఆ సినిమా పేరే ‘ఇడియట్ 2 ఈ చిత్రానికి సంబందించిన ప్రత్యేక సమాచారం మాకు లభించింది. ఈ సినిమా పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకేక్కుతున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో పూరీ కొత్త స్టైల్ చూస్తారని సమాచారం. బ్యాంకాక్ లో మార్చి 15 నుండి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇలియానా హీరొయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. పూరీ ఈ చిత్రం తరువాత ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, నాగ చైతన్యలతో కూడా చేయబోతున్నాడు. పూరి బిజినెస్ మేన్ కి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా చేయబోతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు