సారోచ్చారులో విభిన్న పాత్రలో రవితేజ

సారోచ్చారులో విభిన్న పాత్రలో రవితేజ

Published on Dec 16, 2012 5:30 PM IST

Sarocharu-(1)
ఇప్పటి వరకు రవితేజ పోషించిన పాత్రలు ఫుల్ ఎనర్జిటిక్ మరియు ఎంటర్ టైనింగ్ గా ఉన్నాయి కాని అయన రాబోతున్న చిత్రం “సారోచ్చారు” లో అయన దీనికి విభిన్నంగా సాఫ్ట్ పాత్రలో ఎంటర్ టైన్ చెయ్యనున్నారు. ఈ మధ్య ఈ చిత్ర దర్శకుడు పరశురాం ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ” ప్రతి అమ్మాయికి తను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి లేదా ప్రేమించే అబ్బాయి ఇలానే ఉండాలి అనే కోరిక ఉంటుంది. సారోచ్చారు చిత్రం దాని గురించే ఉంటుంది. ఇద్దరు అమ్మాయిలు ఒకే అబ్బాయిని ప్రేమించడం వలన ఎదుర్కొన్న పరిణామాల గురించి ఈ చిత్రం ఉంటుంది. చివరికి ఎవరు అతని మనసు గెలుచుకున్నారు అన్న విషయం మీరు తెర మీద చూడాల్సిందే” అని చెప్పారు. కాజల్ అగర్వాల్ మరియు రిచా గంగోపాధ్యాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. నారా రోహిత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని త్రీ ఏంజల్స్ స్టూడియో ప్రై లి బ్యానర్ మీద నిర్మించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్విని దత్ సమర్పిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి విజయ్ కె చక్రవర్తి సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం డిసెంబర్ 21న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు