రవితేజకు తెలంగాణా వాదుల సెగ

రవితేజకు తెలంగాణా వాదుల సెగ

Published on Feb 22, 2012 12:53 PM IST


మాస్ మహారాజ రవితేజ తెలంగాణా వాదుల ఆగ్రహానికి గురయ్యాడు. రవితేజ నటిస్తున్న ‘దరువు’ చిత్ర షూటింగ్ తార్నాక ఆర్టీసి హాస్పిటల్లో జరుగుతుంది. ఈ వార్త తెలుసుకున్న తెలంగాణ వాదులు భారీగా తెలంగాణ నినాదాలు చేస్తూ షూటింగ్ ను అడ్డుకున్నారు. వెంటనే అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇరువైపులా వాదన పెరగడంతో తెలంగాణా వాదులు అక్కడి ఫర్నీచర్ ధ్వంసం చేసారు. వెంటనే అక్కడికి పోలీసులు చేరుకొని చక్కదిద్దే ప్రయత్నం చేసారు. షూటింగ్ వాయిదా పడటంతో రవితేజ షూటింగ్ నుండి వెళ్ళిపోయాడు. ఈ చిత్రం శివ డైరెక్షన్లో సోషియో ఫాంటసి చిత్రంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

తాజా వార్తలు