రోమోయోకి డబ్బింగ్ చెప్పిన రవితేజ

రోమోయోకి డబ్బింగ్ చెప్పిన రవితేజ

Published on Oct 29, 2013 8:55 AM IST

romeo_telugu_movie_first_lo

సాయిరాం శంకర్ హీరోగా నటించిన సినిమా ‘రోమియో’. ఈ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితం పూర్తయినప్పటికీ పలు కారణాల వల్ల రిలీజ్ ఆలస్యమవుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను చకచకా పూర్తి చేసే పనిలో పడింది. ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. రవితేజ ఈ సినిమాలో తన సీన్స్ కి డబ్బింగ్ పూర్తి చేసారు.

ఈ సినిమాలో సాయిరాం శంకర్ సరసన అడోనిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ద్వారా పూరి జగన్నాథ్ దగ్గర పనిచేసిన గోపి గణేష్ డైరెక్టర్ గా పరిచయవుతున్నాడు. ఈ సినిమాకి పూరి జగన్నాథ్ కథ- మాటలు అందించాడు. అందుకే ఈ సినిమాకి ‘పూరి రాసిన ప్రేమకథ’ అని ఉపశీర్షిక పెట్టారు. ఇండియన్ కుర్రాడికి, అమెరికా అమ్మాయికి మధ్య జేరిగే ‘రోమియో’ ప్రేమకథకి సునీల్ కశ్యప్ సంగీతం అందించాడు. ఎక్కువ భాగం యూరప్ లో షూట్ చేసిన ఈ సినిమాని వల్లూరిపల్లి రమేష్ నిర్మించాడు.

తాజా వార్తలు