దరువు డబ్బింగ్ పూర్తి చేసిన రవితేజ

దరువు డబ్బింగ్ పూర్తి చేసిన రవితేజ

Published on Apr 3, 2012 9:47 AM IST


మాస్ మహారాజ రవితేజ తను నటిస్తున్న ‘దరువు’ చిత్రానికి డబ్బింగ్ చెప్పడం పూర్తి చేసాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం గ్రాఫిక్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సోషియో ఫాంటసిగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యమలోకంలో తీసిన సన్నివేశాలు ప్రధాన ఆకర్షణ అని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. రవితేజ సరసన తాప్సీ నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ నటుడు ప్రభు యమధర్మరాజుగా నటిస్తున్నాడు. బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. మే 4న విడుదలకు సిద్ధమవుతున్న దరువు చిత్రానికి విజయ్ అంటోని సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు