పోర్చుగల్ లో ఎంజాయ్ చేస్తున్న రవితేజ, శృతి హసన్

పోర్చుగల్ లో ఎంజాయ్ చేస్తున్న రవితేజ, శృతి హసన్

Published on Apr 16, 2013 10:48 AM IST
First Posted at 10:48 on Apr 16th

Raviteja-and-shruthi

మాస్ మహారాజ్ రవితేజ, శృతి హసన్ హీరో హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ‘బలుపు’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పోర్చుగల్లో జరుగుతోంది. ఈ సినిమాలోని పాటకు సంబందించిన సన్నివేశాలని లెస్ బోన్ లో, ఇతర ప్రదేశాలలో షూటింగ్ ని నిర్వహిస్తున్నారు. పోర్చుగల్లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ లో రవితేజ, శృతి హసన్లు అలాగే సినిమా యూనిట్ అంత చాలా ఎంజాయ్ చేస్తున్నారని తెలిసింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారని సమాచారం. ప్రసాద్ వి పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో బ్రహ్మానందం ‘క్రేజీ మోహన్’ గా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా ఆడియోని త్వరలో విడుదలచేసే అవకాశం ఉంది. అలాగే సినిమాని మేలో విడుదల చేయాలనుకుంటున్నారు

తాజా వార్తలు