సూపర్ హిట్ రీమేక్ కోసం రానాతో రవితేజ రెడీ !

మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పన్ కోషియమ్’ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ తెలుగులో రీమేక్ చేయబోతోందని.. ఈ సినిమాలో బాలయ్య బాబు అండ్ రానా కలిసి నటించబోతున్నారని ఇటివలే వార్తలు వచ్చాయి. అయితే ఈ రీమేక్ పై బాలకృష్ణ ఆసక్తి చూపించలేదట. అందుకే బాలయ్య ప్లేస్ లో రవితేజను తీసుకోవాలని చిత్రబృందం ఆలోచిస్తునట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ రీమేక్ లో నటించడానికి రవితేజ – రానా ఇంట్రస్ట్ గా ఉన్నారట. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో రానుంది.

కాగా తాజా అప్ డేట్ ఏమిటంటే రవితేజ మరియు రానా ఇద్దరూ ఆగస్టు నుండి ఈ రీమేక్ కోసం షూట్ ప్రారంభిస్తారట.
ఒరిజినల్ వర్షన్‌ లో పోలీస్ క్యారెక్టర్ చేసిన బిజూ మీనన్ పాత్రలో తెలుగులో రవితేజ చేయబోతున్నాడట. అలాగే మరో హీరో పాత్రలో రానా నటిస్తాడు. ఇక ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులన నిర్మాత సూర్య దేవర నాగవంశీ సొంతం చేసుకున్నారు.

Exit mobile version