ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ మరియు ఇలియానా కలిసి బ్యాంకాక్ వెళ్లారు. ఎందుకంటారా? పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వస్తున్న ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా షూటింగ్ కోసం వారిద్దరు బ్యాంకాక్ వెళ్లారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి పై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. రఘు కుంచె సంగీతం అందిస్తున్న ఈ చిత్రం కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.