రష్మిక ఖాతాలో మరో బంపర్ ఆఫర్?

రష్మిక ఖాతాలో మరో బంపర్ ఆఫర్?

Published on Jun 21, 2020 4:48 PM IST

ఇండస్ట్రీలో లక్కీ లేడీగా పేరుతెచ్చుకున్న రష్మీక మందాన భారీ ఆఫర్స్ దక్కించుకుంటుంది. 2018 ఛలో సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ భామ రెండేళ్లలోనే మహేష్ వంటి టాప్ స్టార్ పక్కన హీరోయిన్ గా చేయడం విశేషమే.ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్ బస్టర్ సరిలేరు నీకెవ్వరు మూవీలో రష్మిక మందాన హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే. ఆ మూవీ విజయంతో మరో టాప్ స్టార్ అల్లు అర్జున్ మూవీలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది.

టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న క్రైమ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ పుష్ప మూవీలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది. కాగా తమిళ సూపర్ స్టార్ విజయ్ మూవీలో కూడా నటించే అవకాశం ఆమెకు దక్కిందని సమాచారం. ప్రస్తుతం మాస్టర్ మూవీ లో నటిస్తున్న విజయ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో రష్మిక నటించనుంది. మరి ఇదే కనుక జరిగితే రష్మికకు బంపర్ ఛాన్స్ దక్కినట్లే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు