రష్మిక నుంచి ఊహించని ట్రీట్.. ‘మైసా’గా నేషనల్ క్రష్!

ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్స్ గా నిలుస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో లేటెస్ట్ గా ధనుష్, శేఖర్ కమ్ముల కలయికలో చేసిన చిత్రం కుబేర కూడా నిలిచింది. ఇలా హీరోయిన్ గా చేసిన అన్ని సినిమాలు భారీ బ్లాక్ బస్టర్స్ హిట్ అయ్యిన నేపథ్యంలో తన నుంచి నిన్నో సాలిడ్ అప్డేట్ వచ్చింది.

తనపై ఒక సోలో సినిమాగా అనౌన్స్ చేసిన సినిమా తాలూకా టైటిల్ సహా ఇంటెన్స్ ప్రీ లుక్ పోస్టర్ ని మేకర్స్ ఇపుడు రిలీజ్ చేశారు. మరి ఇందులో రష్మిక మందన్నా ఒక ఊహించని అవతార్ లో ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు రవీంద్ర పుల్లే దర్శకత్వం వహించగా ఈ సినిమాకి “మైసా” అనే పవర్ఫుల్ టైటిల్ ని లాక్ చేసి రిలీజ్ చేశారు. ఇదైతే మంచి అంచనాలు పెంచే విధంగానే ఉంది. ఇక ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో అనౌన్స్ చేయడం విశేషం. మరి ఈ సినిమాని అన్ ఫార్ములా ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version