లేటెస్ట్ గా టాలీవుడ్ నుంచి రిలీజ్ కి వచ్చిన అవైటెడ్ చిత్రమే “కింగ్డమ్”. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ యాక్షన్ చిత్రం విజయ్ కెరీర్లోనే భారీ ఓపెనింగ్స్ సాధించి అదరగొట్టింది.
ఇక ఈ సినిమా విషయంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా మొదటి నుంచీ మంచి ఎగ్జైటెడ్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఎగ్జైట్మెంట్ లో ఆమె ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూడాలి అనుకుందట. హైదరాబాద్ లో ఫేమస్ సింగిల్ స్క్రీన్స్ లో ఆమె చూద్దామనుకుందట.
ఇలా మొదట శ్రీరాములులో ఆమె సినిమా ప్లాన్ చేసుకుంటూ సెక్యూరిటీ కారణాలు రీత్యా ఆమెకి చూసే వీలు పడలేదట. అయినప్పటికీ తర్వాత మరో సింగిల్ స్క్రీన్ భ్రమరాంబ లో అది కూడా మారు వేషంలో వెళ్లి మరీ కింగ్డమ్ ని చూసినట్టుగా నిర్మాత నాగవంశీ తెలిపారు. ఇది మాత్రం విజయ్, రష్మిక జంట అభిమానులకి ఒక ఊహించని సర్ప్రైజ్ అని చెప్పాలి.