‘నదివే’ అంటూ ఫస్ట్ సింగిల్ సాంగ్‌తో వస్తున్న ‘గర్ల్‌ఫ్రెండ్’

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ బ్యూటీ నటిస్తున్న చిత్రాల్లో రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్న మూవీ ‘ది గర్ల్‌ఫ్రెండ్’. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక తనదైన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు మేకర్స్. అయితే, తాజాగా ఈ చిత్రం నుంచి మరో సాలిడ్ అప్డేట్ అయితే వారు ఇచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ సాంగ్‌గా ‘నదివే’ అనే సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ పాటను జూలై 16న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు వారు సిద్ధమవుతున్నారు.

ఇక ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version