ఈసారి తమిళ్లో కూడా ప్రతాపం చూపించబోతున్న రానా


గత కొంత కాలంగా తెలుగు హీరోలు మరియు దర్శకులు తమ చిత్రాలను ఇతర భాషల్లో విడుదల చేసి తమ మార్కెట్ విలువను పెంచుకుంటున్నారు. ఇప్పుడు యంగ్ హీరో రానా కూడా ఇదే బాట పట్టారు. తన రాబోయే చిత్రం “కృష్ణం వందే జగద్గురుమ్” సినిమాని తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ ” ఒక సురభి కళాకారుడైన ఒక ఇంజనీరింగ్ కుర్రాడి చుట్టూ తిరిగే కథే ఇది. అలాంటి ఓ కుర్రాడికి డాక్యుమెంటరీలు తీసే దేవిక అనే ఒక జర్నలిస్ట్ పరిచయమయ్యాక అతని జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేదే మిగిలిన కథ. ఏ చిత్రాన్ని తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తాం” అని అన్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం చెన్నైలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ విషయం గురించి రానా స్పందిస్తూ ” మొదటిసారి చెన్నైలో జరిగే చిత్రీకరణలో పాల్గొంటున్నాను మరియు మొదటి సారి తమిళ డైలాగ్స్ చెప్పడం కోసం ఎంతో ఉత్సాహంతో ఉన్నాను. ‘కృష్ణం వందే జగద్గురుమ్’ రెండు భాషల్లో వస్తుందన్న వార్త నిజమే మరియు ఇది నా తొలి ద్విభాషా చిత్రం” అని తన ట్విట్టర్లో పేర్కొన్నారు.

‘వేదం’ సినిమాని ‘వానమ్’ పేరుతో తమిళంలో రిమేక్ చేసి విజయం సాదించడంతో క్రిష్ తీస్తున్న ఈ సినిమాకి తమిళంలో కూడా మంచి క్రేజ్ ఏర్పడే అవకాశం ఉంది. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి స్వర బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version