కృష్ణం వందే జగద్గురు క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న రానా

రానా తన రాబోతున్న చిత్రం “కృష్ణం వందే జగద్గురు” చిత్ర క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వై రాజీవ్ రెడ్డి మరియు సాయిబాబా జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ షెడ్యూల్ ని పొల్లాచ్చి, పాలక్కాడ్ మరియు చెన్నైలలో చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని తమిళంలో కూడా విడుదల చెయ్యబోతున్నాం అని, తమిళంలో తన మొదటి చిత్రం అవ్వనుంది అని రానా ప్రకటించారు. “పొల్లాచ్చి,పాలక్కాడ్ మరియు చెన్నైలలో 15 రోజుల షెడ్యూల్ ముగిసింది. క్లైమాక్స్ సన్నివేశ చిత్రీకరణ పూర్తయ్యింది. గలాట్ట మరియు సౌత్ స్కోప్ కోసం షూట్లో పాల్గొనడానికి 2 రోజులు చెన్నైలోనే ఉంటున్నాను” అని ట్విట్టర్లో రానా తెలిపారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా వి ఎస్ జ్ఞానశేకర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Exit mobile version