మణిశంకర్ దర్శకత్వంలో రానా??

మణిశంకర్ దర్శకత్వంలో రానా??

Published on Nov 19, 2013 7:30 PM IST

daggubati-rana

రాజమౌళి ‘బాహుబలి’, గుణశేఖర్ ‘రుద్రమదేవి’ సినిమాల షూటింగ్ ల నడుమ బిజీగా వున్న నటుడు రానా. ఈ చిత్రాలే కాక అందాల రాక్షసి దర్శకుడు హను రాఘవపూడి తో ఒక ద్విభాషా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మొదటిసారిగా రానా సొంత బ్యానర్ అయిన సురేష్ ప్రొడక్షన్స్ లో తెరకెక్కనుంది

ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రానా ప్రస్తుతం సెల్వరాఘవన్ మరియు మణి శంకర్ లతో చర్చలు జరుగుతున్నాయి. సెల్వరాఘవన్ తో సినిమాను ముందుగానే అనుకున్నా మణి శంకర్ చిత్రాన్ని మాత్రం ఊహించనిది అని చెప్పాడు. గతంలో మణి శంకర్ ’16 డిసెంబర్’, ‘రుద్రాక్ష్’, ‘టాంగో చార్లీ’, ‘నాక్ ఔట్’ వంటి సినిమాలు చేసాడు. మరి వీరి కలయికలో వుంటుందో లేదో చూడాలి

తాజా వార్తలు