తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా విష్ణు వర్ధన్ దర్శకత్వంలో తమిళంలో భారీగా తెరకక్కుతున్న చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో రానాఒక కీలక పాత్రలో నటించనున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. రానా ఇటీవలే ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమా చిత్రీకరణ చెన్నైలో జరిగింది, ఆ సమయంలో రానా విష్ణువర్ధన్ ని కలవడం జరిగింది దానితో చెన్నై మీడియా వర్గాలు విష్ణు అడిగిన పాత్రకి రానా ఒప్పుకున్నారని మరియు రానాకి సంభందించిన సన్నివేశాలను ఆగష్టు మొదటి వారంలో చిత్రీకరించనున్నారని ప్రచారం చేస్తున్నాయి. ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రంలో అజిత్, నయనతార, ఆర్య మరియు తాప్సీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎ.ఎం రత్నం నిర్మిస్తున్నారు. ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాతో రానా తమిళ తెరకు పరిచయం కానున్నారు. ఈ చిత్రంలో కూడా నయనతార కథానాయిక కావడం విశేషం.