బాహుబలి కి మించిన కష్టం ఎదురైనదట..!

బాహుబలి కి మించిన కష్టం ఎదురైనదట..!

Published on Jun 12, 2020 8:21 AM IST

బాహుబలి చిత్రంలో భల్లాల దేవుడిగా రానా నటన తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది. ఒంటి చేత్తో అడవి దున్నను మట్టి కరిపించగల బలాఢ్యుడిగా రానా భారీ శరీరంతో ప్రేక్షకులకు గొప్ప అనుభూతి ఇచ్చారు. మరి ఆ భారీ కాయం కోసం రానా గంటల తరబడి వ్యాయామం చేయాల్సివచ్చింది. రాజమౌళి…రానా చేత నిపుణుల సమక్షంలో కఠిన కసరత్తులు చేయించారు.

ఐతే అంతకు మించిన కష్టం ఆయన అరణ్య చిత్రం కోసం పడ్డారట. అరణ్య మూవీలో కొన్ని సన్నివేశాలలో రానా ఏనుగు తొండం భుజాన వేసుకొని నడవాల్సి వచ్చిందట. దాదాపు 160-170 కేజీల బరువు ఉండే ఏనుగు తొండం మోయడం చాలా ఇబ్బందిగా అనిపించేదట. ఇక ఆ సినిమాలో కొన్ని యాక్షన్ సన్నివేశాల కోసం బాగా కష్టపడ్డాడట రానా. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూ లో ఆయన స్వయంగా తెలియజేశారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ హిందీ మరియు తమిళ బాషలలో కూడా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు