రానా దగ్గుబాటి ‘లీడర్’ సినిమాతో తెలుగులో ఘనమైన ఎంట్రీ ఇచ్చినా ఇప్పటివరకూ కమర్షియల్ హిట్ సాధించలేకపోయాడు. ఇప్పుడు తను తన తదుపరి సినిమా బాహుబలి పై చాలా ఆశలు పెట్టుకున్నాడు
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. అతను సెట్లలో చాలా ఆనందంగా గడుపుతున్నాడు. ఈ వారంతరం కూడా పూర్తిగా రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుతున్నట్లు తెలిపాడు. ప్రభాస్ దేహదారుడ్యం లో సరితూగేలా రానా కూడా బాడీని బిల్డ్ చేసాడు. వీరిద్దరి మధ్యా వచ్చే పోరాట సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి
అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను రాజమౌళి తెరకేక్కిస్తున్నాడు. శోభు యార్లగడ్డ మరియు ప్రసాద్ దేవినేని సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు