ఫిలిం నగర్ వర్గాల తాజా సమాచారం ప్రకారం రామోజీ ఫిలిం సిటీ వారు భారీగా సినిమా ఫైనాన్స్ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారని సమాచారం. యువ నటులు మరియు యువ దర్శకులకు అవకాశం ఇచ్చే ఉద్దేశ్యంతో రాబోతున్నారని సమాచారం. ఒకేసారి పలు ప్రాజెక్టులు ప్రారంబించబోతున్నారు. ఇప్పటికే ప్రముఖ నిర్మాతలు పలు సినిమాలు ప్రకటించారు. వారికీ భారీ మొత్తంలో క్యాష్ ఫైనాన్స్ చేసి రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరిపే ఆలోచనతో ఈ రంగంలోకి దిగినట్లుగా తెలుస్తుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆర్.ఎఫ్.సి వారు ఇన్స్టిట్యుట్ కూడా ప్రారంబించబోతున్నారని సమాచారం.