యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలున్నాయి, అదే రేంజ్ లో ఈ చిత్ర ఆడియో పై కూడా ఉన్నాయి. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా ఆడియోని ఒకరోజు ముందుగా నాగా సెప్టెంబర్ 21న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అలాగే ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
ముందుగా అనుకున్న దాని ప్రకారం ఈ ఆడియోని సెప్టెంబర్ 22న శిల్పకళావేదికలో చేయడానికి ప్లాన్ చేసారు. కానీ ఇప్పుడు డేట్ మారడం వల్ల వేదికని కూడా మారుస్తున్నారు. ఎల్క్కువభాగా ఈ ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని హోటల్ మారియట్ లో చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ ఓ కీలాక్ పాత్రలో కనిపించనుంది. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.