బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో ‘రామాయణ’ కూడా ఒకటి. ఎపిక్ మైథలాజికల్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను దర్శకుడు నితేష్ తివారీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడి పాత్రలో నటిస్తుండగా.. అందాల భామ సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తోంది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ ట్రీట్‌ను ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. రామాయణ చిత్ర ఫస్ట్ గ్లింప్స్ వీడియోను జూలై 3న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ గ్లింప్స్‌ను ఉదయం 11.30 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. కాగా, ఇండియా వ్యాప్తంగా 9 నగరాల్లో ఈ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు.
ఇక ఈ గ్లింప్స్‌ను బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా, పూణె, కొచ్చి, హైదరాబాద్ నగరాల్లోని పలు థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో యష్, సన్నీ డియోల్, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, అరుణ్ గోవిల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.