రికార్డుల కోతకు రెడీ అవుతున్న రాంబాబు

రికార్డుల కోతకు రెడీ అవుతున్న రాంబాబు

Published on Oct 16, 2012 10:30 AM IST


ఒకవైపు పవన్ కళ్యాణ్ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ అక్టోబర్ 18న విడుదలకు సిద్ధమవుతుండగా మరో వైపు రాంబాబు ఈ సినిమాతో పాత రికార్డుల కోతకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాని నైజాం ఏరియాలో రికార్డు స్థాయిలో విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాదులో భారీ స్థాయిలో 100కి పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు.గతంలో బిజినెస్ మేన్ పేరిట ఉన్న రికార్డు ఈ సినిమాతో బ్రేక్ కాబోతుంది. అలాగే హైదరాబాదులోనే 24 థియేటర్లలో ఉదయం 6 గంటల నుండే ఫాన్స్ షోలు మొదలు కానున్నాయి. ఫాన్స్ షోలు ముందుగా మొదలవుతుండటంతో ఈ షోలకి భారీ క్రేజ్ ఉంది. కేవలం ఈ ఫాన్స్ షోల ద్వారానే కోటి రూపాయలు పైగా రాబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. భారీ రిలీజ్ ఉండటంతో ఈ సినిమాకి ఫస్ట్ డే రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రావడం ఖాయం.

తాజా వార్తలు