టాలీవుడ్ పెద్దలకు పద్మ శ్రీ, పద్మ భూషణ్ అవార్డు

Padma-Awards

టాలీవుడ్లో నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకొని, దాదాపు అన్ని భాషల్లోనూ సినిమాలు నిర్మించిన మూవీ మొఘల్ డా. డి రామానాయుడు గారికి ఈ సంవత్సరం పద్మ అవార్డుల విభాగంలో పద్మ భూషణ్ అవార్డ్ ఇచ్చి భారత ప్రభుత్వం సత్కరించనుంది. ఇటీవలే ఆయన దాదా సాహెబ్ పాల్కే అవార్డు అందుకున్నారు. భారతదేశం గర్వించ దగ్గ నిర్మాతల్లో ఒకరైన డా. డి రామానాయుడు గారికి పద్మభూషణ్ అవార్డు రావడం

అలాగే బొమ్మలతో రామాయణాన్ని రచించిన ఘనత సంపాదించుకున్న బాపు గారు ఒక్క ఆర్టిస్ట్ గానే కాకుండా, డైరెక్టర్ గా, పెయింటర్ గా, డిసైనర్ గా ఎంతో ఘనత సాధించిన బాపు గారికి ఈ సంవత్సరం పద్మ శ్రీ ఇచ్చి భారత ప్రభుత్వం సత్కరించనుంది. ఇటీవలే నందమూరి బాలకృష్ణ, నయనతారలను పెట్టి తీసిన ‘శ్రీ రామరాజ్యం’ సినిమాలో రామాయణంలోని లవ కుశ ఘట్టాన్ని అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు.

టాలీవుడ్ సీనియర్ దిగ్గజాలుగా చెప్పుకునే డా. డి రామానాయుడు, బాపు గారికి పద్మ అవార్డులు రావడం టాలీవుడ్ గర్వించదగ్గ విషయం. వారికి 123తెలుగు.కామ్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

Exit mobile version