మేర్లపాక గాంధీ, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా రిలీజ్ కాకముందు వరకూ ఈ పేరు ఎవరికీ తెలియదు. కానీ ఈ సినిమా విజయంతో ఇంతనికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. కొద్ది రేజుల క్రితం తన రెండవ సినిమా రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా ప్లాన్ చేసుకుంటున్నానని గాంధీ తెలిపాడు. తాజాగా ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం మేర్లపాక గాంధీ హీరోగా రామ్ ని సెలక్ట్ చేసుకున్నాడు. ఇప్పటికే గాంధీ చెప్పిన స్టొరీ రామ్ కి నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రామ్ తదుపరి సినిమా విషయంలో త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం రామ్ తన తదుపరి సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ‘మసాలా’ సినిమా తర్వాత నుంచి తన తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉన్న రామ్ ఆ సినిమాకి డైరెక్టర్ ఎవరు? తదితర విషయాలు బయటకి చెప్పడం లేదు.
ఇదిలా ఉంటే మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేసిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద బిగ్ హిట్ అవ్వడమే కాకుండా సందీప్ కిషన్ కెరీర్లో సోలో హిట్ గా నిలిచింది.