చివరి దశకు చేరుకున్న ‘ఎందుకంటే ప్రేమంట’


రామ్ మరియు తమన్నా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఎందుకంటే ప్రేమంట’ షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. ఈ చిత్ర చివరి షెడ్యుల్ మార్చి 27తో ముగియనుంది. ఏప్రిల్ చివరి వారంలో చిత్ర విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ముఖ్య తారాగణం పై విశాఖపట్నంలో ఒక పాట చిత్రీకరిస్తున్నారు. ప్రేమకథలు తీయడంలో తనకంటూ ప్రత్యేక శైలి ఏర్పరుచుకున్న కరుణాకరన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం పై యూత్ లో అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. గతంలో హిట్ సినిమాలు నిర్మించిన స్రవంతి రవి కోశోర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. రాధిక ఆప్టే, సుమన్ మరియు రఘు బాబు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version