టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “రెడ్”. రామ్ హిట్ డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ కోసం చాలా మందే ఎదురు చూస్తున్నారు. దీనికి ముందు రామ్ తీసిన “ఇస్మార్ట్ శంకర్” చిత్రం భారీ హిట్ కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ క్రమంలో వచ్చిన లాక్ డౌన్ మూలాన ఈ సినిమా విడుదలకు బ్రేక్ పడింది.
దీనితో ఈ చిత్రానికి కూడా ఓటిటి ఆఫర్స్ వచ్చాయి. కానీ మేకర్స్ మాత్రం మొత్తానికి ఏఈ చిత్రాన్ని థియేటర్స్ లోనే విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే లోగా రామ్ తన చిత్ర యూనిట్ తో ఈ గ్యాప్ లో కూర్చొని స్పెషల్ ప్లానింగ్స్ వేసినట్టు తెలుస్తుంది. ఈ చిత్రం విడుదల సమయానికి ప్రత్యేకంగా ప్రమోషన్స్ జరపాలని సూచించాడట.
దీనితో అదే ప్లానింగ్ లో చిత్ర యూనిట్ ఉన్నట్టు సమాచారం. ఈ చిత్రంలో రామ్ సరసన మాళవికా శర్మ హీరోయిన్ గా నటించగా నివేతా పెత్తురాజ్ కీలక పాత్రలో నటించింది. అలాగే ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా స్రవంతి రవికిశోర్ నిర్మాణం వహించారు.